భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పన్నెండవ శ్లోకము

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ||

ఇష్టాన్ = కోరబడిన
భోగాన్ = జీవితావశ్యకములను
హి = నిశ్చయముగా
వః = మీకు
దేవాః = దేవతలు
దాస్యన్తే = ఒసగగలరు
యజ్ఞభావితాః = యజ్ఞాచరణముచే తృప్తినొందింపబడినవారై
తైః = వారిచే
దత్తాన్ = ఒసగబడినవానిని
అప్రదాయ = అర్పింపక
ఏభ్యః = ఆ దేవతలకు
యః = ఎవడు
భుక్తే = అనుభవించునో
స్తేనః = దొంగ
ఏవ = నిశ్చయముగా
సః = అతడు

తాత్పర్యం :-

వివిధ జీవితావష్యకములనిచ్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచరనముచే తృప్తులై మీకావశ్యక వస్తువులన్నింటిని ఇత్తురు. కానీ దేవతలిచ్చు వస్తువులను మరలవారికియ్యకుండా అనుభవించు వాడు నిజముగా దొంగయే అగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top