భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై ఒకటవ శ్లోకము

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః |
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||

యత్ యత్ = దేనిని
ఆచరతి = ఒనరించునో
శ్రేష్ఠ = ఉత్తముడైనవాడు
తత్ = దానిని
తత్ = మరియు దానిని మాత్రమే
ఏవ = నిశ్చయముగా
ఇతరః జనః = ఇతరజనులు కూడా
సః = అతడు
యత్ = దేనిని
ప్రమాణమ్ = ప్రమాణముగా
కురుతే = చేయునో
లోకః = ప్రపంచమంతయు
తత్ = దానిని
అనువర్తతే = అనుసరించును

తాత్పర్యం :-

మహనీయుడైన వ్యక్తి ఏ కార్యములు చేయునో వారిని సామాన్యులు కూడా అనుసరింతురు. ఆదర్శ ప్రాయులైన కార్యములచే అతడే ప్రమాణములను స్వీకరించునో ప్రపంచమంతయు వారిననుసరించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top