భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఆరవ శ్లోకము

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ |
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ||

కర్మేంద్రియాణి = ఐదు కర్మేంద్రియములను
సంయమ్య = నిగ్రహించి
యః = ఎవడు
ఆస్తే = ఉండునో
మనసా = మనస్సుచే
స్మరన్ = ధ్యానించుచు
ఇంద్రియార్థాన్ = ఇంద్రియ విషయములను
విమూఢాత్మా = మూఢుడైన జీవుడు
మిథ్యాచారః = నటనచేయువాడని
సః = అతడు
ఉచ్యతే = చెప్పబడును

తాత్పర్యం :-

కర్మేంద్రియములు నిగ్రహించిననూ మనస్సుచే ఇంద్రియార్ధములను ధ్యానించు వాడు తన్ను తాను మోసగించుకొనును. అట్టివాడు కపటి అనబడును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top