భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై నాలుగవ శ్లోకము

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ ||

ఇంద్రియస్య = ఇంద్రియముల యొక్క
ఇంద్రియస్యార్థే = ఇంద్రియవిషయముల యందు
రాగద్వేషౌ = ఆసక్తియు, అనాసక్తియు
వ్యవస్థితౌ = నియమింపబడినవి
తయోః = వాని యొక్క
వశమ్ = వశమును
న ఆగచ్ఛేత్ = మానవుడు పొందరాదు
తౌ = అవి
హి = నిశ్చయముగా
అస్య = అతనికి
పరిపంథినౌ = ఆటంకములు

తాత్పర్యం :-

ఇంద్రియములకునూ, ఇంద్రియార్థములకునూ సంభందించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని సిద్ధాంతములు కలవు. ఆత్మ సాక్షాత్కార మార్గమునకు అవి ఆటంకములగుటచే మానవుడు అట్టి రాగద్వేషములకు వశము కాకూడదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top