భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవై నాలుగవ శ్లోకము

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ |
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ||

ఉత్సీదేయుః = నాశనము పొందును
ఇమే లోకాః = ఈ లోకములన్నియు
న కుర్యాం = నేను చేయనిచో
కర్మ = విహితకర్మమును
చేత్ = ఒకవేళ
అహం = నేను
సంకరస్య = అవాంఛనీయమైన ప్రజాబాహుళ్యమునకు
చ = మరియు
కర్తా = సృజించినవాడను
స్యాం = అగుదును
ఉపహన్యాం = నాశనము చేసినవాడనగుదును
ఇమాః ప్రజాః = ఈ జీవులందరిని

తాత్పర్యం :-

నేను విహిత కర్మములను చేయనిచో ఈ లోకములన్నియు నాశనమునకు గురికావలసి వచ్చును. నేను అవాంచనీయమైన ప్రజాబాహుల్యమునకు కారకుడనై తద్వారా సర్వ జీవుల శాంతిని ద్వంశము చేసినవాడనగుదును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top