భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పదమూడవ శ్లోకము

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః |
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ||

యజ్ఞశిష్ట = యజ్ఞము ముగిసిన పిమ్మట ఆహారమును
ఆశినః = భుజించునట్టి
సన్తః = భక్తులు
ముచ్యన్తే = విడువబడుదురు
సర్వకిల్బిషైః = అన్నిపాపముల నుండి
భుంజతే = అనుభవింతురు
తే = వారు
తు = కాని
అఘం = ఘోరపాపమును
పాపాః = పాపులు
యే = ఎవరు
పచన్తి = వండుదురో
ఆత్మకారణాత్ = ఇంద్రియతృప్తి కొరకు

తాత్పర్యం :-

భగవత్ భక్తులు మొదట యజ్ఞమున అర్పింప బడిన ఆహారశేషమూ భుజింతురు. కావున సర్వవిధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ స్వయ ఇంద్రియానుభూతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకొనువారు పాపమునే భుజింతురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top