భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పయవ శ్లోకము

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా |
నిరాశీర్నిర్మమో భూత్వా యుద్ధ్యస్వ విగతజ్వరః ||

మయి = నాకు
సర్వాణి కర్మాణి = అన్నికర్మములను
సన్న్యస్య = పూర్తిగా విడిచి
ఆధ్యాత్మచేతసా = ఆత్మజ్ఞానపూర్ణుడవై
నిరాశీః = లాభమునందు కోరికలేనివాడవు
నిర్మమః = మమత్వము లేనివాడవు
భూత్వా = అయి
యుద్ధ్యస్వ = యుద్ధము చేయుము
విగతజ్వరః = మాంద్యము లేనివాడవై

తాత్పర్యం :-

అందుచే ఓ అర్జునా! నన్ను గురించి సంపూర్ణ జ్ఞానము కలవాడవైఫలాపేక్ష లేనివాడవై మమకార హీనుడవై నీ కర్మములనన్నిటినీ నాకు సమర్పించి అలసత్వము విడిచి యుద్ధము చేయుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top