భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ముప్పై మూడవ శ్లోకము

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి |
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ||

సదృశం = తగినట్లు
చేష్టతే = చేయును
స్వస్యాః = తనయొక్క
ప్రకృతేః = గుణములు
జ్ఞానవానపి = జ్ఞానవంతుడైనను
ప్రకృతిం = స్వభావమును
యాన్తి = పొందును
భూతాని = జీవులన్నియును
నిగ్రహః = నిగ్రహము
కిం = ఏమి
కరిష్యతి = చేయగలదు

తాత్పర్యం :-

ప్రతి మానవుడునూ త్రిగుణముల నుండి తాను పొందిన స్వభావమును అనుసరించును. జ్ఞానవంతుడైన వాడు కూడా తన స్వభావమునకు తగినట్లు వర్తించును. నిగ్రహమేమి చేయగలదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top