భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - పదిహేడవ శ్లోకము

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః |
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ||

యః = ఎవడు
తు = కాని
ఆత్మరతిః = ఆత్మ యందే ఆనందము గొనుచు
ఏవ = నిశ్చయముగా
స్యాత్ = నిలుచునో
ఆత్మతృప్తః = ఆత్మవికాసము కలవాడు
చ = మరియు
మానవః = మానవుడు
ఆత్మని = ఆత్మయందు
ఏవ = మాత్రమే
చ = మరియు
సంతుష్టః = పూర్ణతుష్టుడు
తస్య = వానికి
కార్యం = చేయదగినపని
న విద్యతే = ఉండదు

తాత్పర్యం :-

కాని ఆత్మయందే ఆనందము కలవాడై తన జీవితమును ఆత్మానుభవమునందు మగ్నము కావించి ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టుడై ఉండు వానికి చేయవలసిన కర్మయే ఉండదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top