భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - ఇరవయవ శ్లోకము

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ||

కర్మణా = కర్మము
ఏవ = చేతనే
హి = నిశ్చయముగా
సంసిద్ధిం = సంపూర్నత్వమును
ఆస్తితాః = పొందిరి
జనకాదయః = జనకుడును ఇతర రాజులును
లోకసంగ్రహమ్ = జనసామాన్యము
ఏవ అపి = కూడా
సంపశ్యన్ = నిమిత్తమై
కర్తుం = పనిచేయుటకు
అర్హసి = తగుదువు

తాత్పర్యం :-

జనకుడు మొదలైన రాజులు విహిత కర్మాచరణముచే మాత్రమే పరిపూర్ణత్వమును పొందజాలిరి. అందుచే సామాన్యజనులకు కర్తవ్యమును భోదించుటకై నీ పనిని నీవు చేయవలయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top