భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము

భగవద్గీత - కర్మయోగము - మూడవ అధ్యాయము - నాలుగవ శ్లోకము

న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుశోఽశ్నుతే |
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ||

కర్మణాం = విధ్యుక్తధర్మములు
అనారమ్భాత్ = ఒనరింపకపోవుట వలన
నైష్కర్మ్యం = కర్మఫలము నుండి విముక్తి
పురుషః = మానవుడు
న అశ్నుతే = పొందడు
సన్న్యసనాత్ ఏవ = కేవలము సన్న్యసించుట మాత్రము చేతనే
సిద్ధిం = జయమును
చ = కూడా
న సమధిగచ్ఛతి = పొందడు

తాత్పర్యం :-

కేవలమూ కర్మ చేయకుండుటచే మానవుడు కర్మఫల విముక్తి పొందడు. అట్లే కేవలము సన్యాసముచే అతడు పరిపక్వత పొందజాలడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top