భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఎనిమిదవ శ్లోకము

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్ |
అవాప్య భూమౌ అసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ||

హి = నిశ్చయముగా
న ప్రపశ్యామి = గాంచలేకున్నాము
మమ = నా యొక్క
అపనుద్యాత్ = తొలగింపగలిగినట్టి
యత్ = ఏదైతే
శోకం = దుఃఖమును
ఉచ్ఛోషణం = శోషింపజేయునట్టి
ఇన్ద్రియాణాం = ఇంద్రియముల యెడ
అవాప్య = పొంది
భూమౌ = ధరిత్రిపై
అసపత్నం = శత్రురహితమైన
ఋద్దం = సమృద్ధమైన
రాజ్యం = రాజ్యమును
సురాణాం = దేవతల యొక్క
అపి = అయినను
చ = కూడా
ఆధిపత్యమ్ = ఆధిపత్యము

తాత్పర్యం :-

నా ఇంద్రియములను శోశింప చేయునట్టి దుఃఖమును తొలగించునట్టి సాధనమును కనుగోనజాలకున్నాను. స్వర్గమున దేవతలు పొందునట్టి శత్రుహీనమును సంపద్సమ్రుద్ధమును అయిన రాజ్యమును భూమిపై పొందిననూ దుఃఖమును నేను తొలగించకొనజాలకున్నాను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top