భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పదిహేనవ శ్లోకము

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ||

యం = ఎవనిని
హి = నిశ్చయముగా
న వ్యథయన్తి = బాధింపవో
ఏతే = ఇవన్నియు
పురుషం = మానవుని
పురుషర్షభ = మానవశ్రేష్టుడా
సమ = కలతనొందని
దుఃఖ = దుఃఖమునందు
సుఖం = సుఖమునందు
ధీరం = ధీరుని
సః = అతడు
అమృతత్వాయ = మోక్షమునకు
కల్పతే = అర్హునిగా భావింపబడును

తాత్పర్యం :-

పురుష శ్రేష్టుడైన ఓ అర్జునా సుఖదుఃఖములచే కలతనొందక రెండు సమయములందును ధీరుడైయుండు మానవుడు ముక్తికర్హుడగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top