భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై మూడవ శ్లోకము

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః |
స్మృతిభ్రంశాద్బుద్దినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ||

క్రోధాత్ = క్రోధము వలన
భవతి = కలుగును
సమ్మోహః = అధికమైన మోహము
సమ్మోహాత్ = మోహము వలన
స్మృతివిభ్రమః = జ్ఞాపకశక్తి యొక్క సంభ్రమము
స్మృతిభ్రంశాత్ = జ్ఞాపకశక్తి నశింపు
బుద్ధినాశః = బుద్ధినాశము
బుద్ధినాశాత్ = బుద్ధినాశము వలన
ప్రణశ్యతి = మానవుడు పతితుడగును

తాత్పర్యం :-

కోపము వలన అధికమైన మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతిబ్రాంతి జనించును. స్మృతిబ్రాంతి వలన తెలివి నశించును. తెలివి నశించినపుడు మానవుడు మరల భోగగర్తమునందు కూలును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top