భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై ఒకటవ శ్లోకము

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

తాని సర్వాణి = ఆ ఇంద్రియములన్నింటిని
సంయమ్య = నిగ్రహించి
యుక్తః = నియోగించువాడు
ఆసీత = కావలెను
మత్పరః = నా యెడ సంబంధముతో
వ శే = వశము నందు
హి = నిశ్చయముగా
యస్య = ఎవని
ఇన్ద్రియాణి = ఇంద్రియములు
తస్య = అతని
ప్రజ్ఞా = బుద్ధి
ప్రతిష్ఠితా = స్థిరమై యుండును

తాత్పర్యం :-

తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశం నందుంచుకొని బుద్ధిని నా యందే స్థిరముగా నుంచు వాడు స్థితప్రజ్ఞుడనబడును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top