భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై తొమ్మిదవ శ్లోకము

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు |
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ||

ఏషా = ఇదియంతయు
తే = నీకు
అభిహితా = వర్ణింపబడినది
సాంఖ్యే = సాంఖ్యమునందు
బుద్ధిః = తెలివి
యోగే = ఫలాపేక్ష లేని కార్యమునందు
తు = కాని
ఇమాం = దీనిని
శ్రణు = వినుము
బుద్ధ్యా = తెలివితో
యుక్తః = కూడినవాడై
యయా = దేనిచే
పార్థ = ఓ పృథాకుమారా
కర్మబన్థం = కర్మబంధమును
ప్రహాస్యసి = విడివడగలవు

తాత్పర్యం :-

ఇంతవరకు నేను సాంఖ్యము ననుసరించి ఆత్మ జ్ఞానమును గూర్చి నీకు వర్ణించితిని. ఇప్పుడు పలాపెక్ష లేకుండా పనిచేయు విషయమును గూర్చి వివరింతును వినుము. ఓ కౌంతేయా నీవు అట్టి జ్ఞానముతో పనిచేసినచో కర్మబంధముల నుండి విముక్తుడవు కాగలవు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top