భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై తొమ్మిదవ శ్లోకము

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ||

యా = ఏది
నిశా = రాత్రియో
సర్వభూతానాం = సర్వ జీవులకును
తస్యాం = దానియందు
జాగర్తి = మేల్కొని యుండును
సంయమీ = ఆత్మనిగ్రహము కలవాడు
యస్యాం = దేని యందు
జాగ్రతి = మేల్కొనియుండునో
భూతాని = జీవులన్నియు
సా = అట్టి
నిశా = రాత్రి
పశ్యతః = అంతర్ముఖుడైన
మునేః = మునికి

తాత్పర్యం :-

సర్వజీవులకునూ రాత్రియైనది ఆత్మనిగ్రహము కలవారు మేల్కొనిఉండు సమయము. సర్వజీవులకునూ మేల్కొని ఉండు సమయము అంతర్ముకుడైన మునికి రాత్రి.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top