భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పద్దెనిమిదవ శ్లోకము

అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||

అన్తవన్తః = నాశవంతమైనవి
ఇమే దేహాః = ఈ భౌతికశరీరములు
నిత్యస్య = శాశ్వతమైన
ఉక్తాః = చెప్పబడినవి
శరీరిణః = దేహధారి యొక్క
అనాశినః = ఎప్పుడును నశింపని
అప్రమేయస్య = పరిమితిలేని
తస్మాత్ = అందుచే
యుధ్యస్వ = యుద్ధము చేయుము
భారత = ఓ భరతవంశీయుడా

తాత్పర్యం :-

నాశము లేనట్టియు, అప్రమేయమైనట్టియు, శాశ్వతమైనట్టియు జీవాత్మయొక్క బౌతిక శరీరము తప్పక అంతమొందును. అందుచే ఓ భరతవంశీయుడా యుద్ధము చేయబూనుము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top