భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై ఒకటవ శ్లోకము

స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్చ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ||

స్వధర్మం = స్వీయధర్మమును
అపి = కూడా
చ = నిక్కముగా
అవేక్ష్య = భావించి
వికమ్పితుం = సంశయించుటకు
న అర్హసి = తగవు
ధర్మ్యాత్ = ధర్మము కొరకు
హి = నిశ్చయముగా
యుద్దాత్ = యుద్ధముకంటె
శ్రేయః = మేలైనది
అన్యత్ = ఇంకొకటి
క్షత్రియస్య = క్షత్రియునికి
న విద్యతే = ఉండదు

తాత్పర్యం :-

క్షత్రియుడుగా నీ ప్రత్యేక ధర్మమును పరిశీలించిననూ ధర్మానుగునమైన యుద్ధము కంటే మేలయినది మరియొకటి లేదనీ నీవు గ్రహింపవలయును. అందుచే నివీవిషయమున సంశయించనవసరములేదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top