భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై ఒకటవ శ్లోకము

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన |
బహూశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ||

వ్యవసాయాత్మికా = కృష్ణభక్తిరసభావనలో స్థిరమైనవారు
బుద్ధిః = బుద్ధి
ఇహ = ఈ ప్రపంచమున
ఏకా = ఒక్కటే
కురునన్దన = కురునందనా
బహుశాఖాః = అనేకశాఖలు కలిగిన
హి = నిశ్చయముగా
అనన్తాః = అసంఖ్యాకములైనవి
చ = కూడా
బుద్ధయః = బుద్ధి
అవ్యవసాయినామ్ = కృష్ణభక్తిరసభావనలో లేనివారి యొక్క

తాత్పర్యం :-

ఈ కృష్ణచైతన్య మార్గమునందున్నవారు స్తిరమైన ప్రయోజము కలవారుగానుందురు. వారి ఉద్దేశ్యము ఒక్కటే. ఓ కురునందనా! నిక్షయము లేనివారి బుద్ధులు అనేకవిధములుగా నుండును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top