భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఆరవ శ్లోకము

న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః |
యానేవ హత్వా న జిజీవిషామః తేఽవస్థితాః ప్రముఖే దార్తరాష్ట్రాః ||

ఏతత్ = ఇది
న చ విద్మః = ఎరుగము
కతరత్ = ఏది
నః = మాకు
గరీయః = మేలైనదో
యత్ వా జయేమ = జయించుటయో
నః = మమ్ము
యది వా జయేయుః = వారు జయించుటయో
యాన్ = ఎవరిని
ఏవ = నిశ్చయముగా
హత్వా = చంపి
న జిజీవిషామః = జీవింప వంఛింపమో
తే = వారందరును
అవస్థితాః = నిలిచియున్నారు
ప్రముఖే = ఎదుటనే
ధార్తరాష్ట్రాః = ధృతరాష్ట్రుని కుమారులు

తాత్పర్యం :-

మేము వారిని జయించుటయో, వారు మమ్ములను జయించుటయో ఏది హితకరమైనదో మేము తెలిసికొనజాలకున్నాము. ఏ దృతరాష్ట్ర కుమారులను చంపి మేము జీవింప వాంచింపమో అట్టివారిప్పుడు యుద్ధరంగమున మాకెదురుగానిలబదియున్నారు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top