భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పదకొండవ శ్లోకము

శ్రీభగవానువాచ
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||

శ్రీభగవానువాచ = శ్రీకృష్ణభగవానుడు పలికెను
అశోచ్యాన్ = దుఃఖింపదగనివానిని గూర్చి
అన్వశోచః = విచారించుచున్నావు
త్వం = నీవు
ప్రజ్ఞావాదాన్ = ప్రజ్ఞను గూడిన పలుకులను
చ = కూడా
భాషసే = పలుకుచున్నావు
గతాసూన్ = మరణించినవారిని గూర్చియు
అగతాసూన్ చ = జీవించియున్నవారిని గూర్చియు
న అనుశోచన్తి = దుఃఖింపరు
పండితాః = పండితులైనవారు

తాత్పర్యం :-

దేవాతిదేవుడు పలికెను - నీవు మహాజ్ఞానులు వచింపదగిన మాటలు మాట్లడుచు దుఖింపదగని విషయమును గూర్చి దుఖించుచున్నావు. విద్వాంసులు జీవించియున్నవారిని గూర్చి గాని, మరణించిన వారిని గూర్చి గాని శోకింపరు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top