భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై ఎనిమిదవ శ్లోకము

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత |
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ||

అవ్యక్తాదీని = ఆరంభదశలో కనబడక
భూతాని = సృజింపబడిన జీవులు
వ్యక్తమధ్యాని = మధ్యదశలో కనబడి
భారత = ఓ భరతవంశీయుడా
అవ్యక్తనిధనాని = నశించినపుడు కనబడక
ఏవ = ఆ విధముగా
తత్ర = కనుక
కా పరిదేవనా = దుఃఖమెందులకు

తాత్పర్యం :-

సృజింపబడిన జీవులన్నియు మొదట అవ్యక్తములే. మధ్య అవి వ్యక్తములగుచున్నవి. నాశనము పొందునపుడు మరల అవ్యక్తములగును. అందుచే దుఃఖించుటకు కారణమేమి కలదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top