భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై ఎనిమిదవ శ్లోకము

యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్దేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||

యదా = ఎప్పుడు
సంహరతే = ముడుచుకొనును
చ = కూడా
అయం = అతడు
కూర్మః = తాబేలు
అంగాని = అవయములను
ఇవ = వాలె
సర్వశః = అన్ని
ఇన్ద్రియాణి = ఇంద్రియములను
ఇన్ద్రియార్థేభ్యః = ఇంద్రియవిషయముల నుండి
తస్య = అతని
ప్రజ్ఞా = బుద్ధి
ప్రతిష్ఠితా = స్థిరముగా నుండును

తాత్పర్యం :-

తాభేలు తన అవయములను లోనికి ముడుచుకొనునట్లు ఇంద్రియ విషయముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సమగ్ర జ్ఞానమందు సుస్థిరముగా నున్నవాడగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top