భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై ఆరవ శ్లోకము

అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః |
నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ||

అవాచ్య = దయాహీనములైన
వాదాన్ = కల్పిత వచనములను
చ = కూడా
బహూన్ = పెక్కింటిని
వదిష్యన్తి = పలుకుదురు
తవ = నీ యొక్క
అహితాః = శత్రువులు
నిన్దన్తః = నిందించుచు
తవ = నీ యొక్క
సామర్థ్యం = శక్తిని
తతః = అంతకంటె
దుఃఖతరం = మిక్కిలి దుఃఖమును కలిగించునది
ను కిమ్ = ఏమి కలదు

తాత్పర్యం :-

నీ శత్రువులు నిన్ను నిర్దయ వాక్యములతో వర్ణించి నీ సామర్ధ్యమును నిదింతురు. ఇంతకన్ననూ దుఃఖకరమైనది మరి ఏమి కలదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top