భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై ఒకటవ శ్లోకము

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ ||

కర్మజం = కామ్యకర్మల వలన కలుగు
బుద్ధి యుక్తాః = భక్తియుక్తమైన సేవలో నియుక్తులై
హి = నిశ్చయముగా
ఫలం = ఫలమును
త్యక్త్వా = విడిచి
మనీషిణః = గొప్పఋషులు లేదా భక్తులు
జన్మబన్ధవినిర్ముక్తాః = జననమరణ బంధముల నుండి విడివడినవారై
పదం = స్థితిని
గచ్ఛన్తి = పొందుదురు
అనామయమ్ = దుఃఖరహితమైన

తాత్పర్యం :-

భగవంతుని భక్తియుక్తమైన సేవలో నిమగ్నులై ఉండుటవలన గొప్ప మునులునూ, భక్తులును భౌతిక ప్రపంచములందలి కర్మఫలముల నుండి విముక్తులగుదురు. ఈ విధముగా జనన మరణ చక్రము నుండి విడివడి తిరిగి భగవంతుని చేరుటచే దుఃఖ రహితమైన స్థితిని పొందుదురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top