భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై ఆరవ శ్లోకము

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||

దుఃఖేషు = మూడురకములైన దుఃఖముల యందు
అనుద్విగ్నమనాః = కలతపొందని మనస్సు గలవాడు
సుఖేషు = సుఖమునందు
విగతస్పృహః = కోరికలేనివాడు
వీత = లేనివాడు
రాగ = ఆసక్తియు
భయ = భయమును
క్రోధః = కోపమును
స్థితధీః = స్థిరమైన మనస్సు గల
మునిః = ముని
ఉచ్యతే = చెప్పబడును

తాత్పర్యం :-

మూడు విధములైన దుఃఖములయందును కలతనొందని వాడునూ, సౌక్యము కలిగినపుడు ఉప్పొంగనివాడును, ఆసక్తీ, భయము, కోపము అను వాని నుండి తొలగిన వాడునూ స్థిరమైన మనస్సు గల మునియని చెప్పబడును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top