భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై ఏడవ శ్లోకము

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేఽర్దే న త్వం శోచితుమర్హసి ||

జాతస్య = పుట్టినవానికి
హి = నిశ్చయముగా
ధ్రువః = యథార్థము
మృత్యుః = మృత్యువు
ధ్రువం = అదియును సత్యమే
జన్మ = పుట్టుక
మృతస్య = చనిపోయినవానికి
చ = కూడా
తస్మాత్ = అందుచే
అపరిహార్యేర్దే = పరిహరించుతాకు వీలు లేని విషయము నందు
త్వం = నీవు
శోచితుం = దుఃఖించుటకు
న అర్హసి = తగవు

తాత్పర్యం :-

పుట్టినవాడు చావకతప్పదు. మరణించిన పిమ్మట మరల అతడు జన్మించకనూ తప్పదు. అందుచే పరహరించుటకు వీలు లేని ధర్మనిర్వహము నందు నీవు దుఃఖింపరాదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top