భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - డెబ్బై ఒకటవ శ్లోకము

విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిః స్పృహః |
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ||

విహాయ = విడిచి
కామాన్ = ఇంద్రియసుఖమునకు సంబంధించిన భౌతికవాంఛలను
సర్వాన్ = అన్నింటిని
యః పుమాన్ = ఏ పురుషుడు
చరతి = జీవించునో
నిః స్పృహః = కోరికలు లేనివాడై
నిర్మమః = మమత్వము లేనివాడై
నిరహంకారః = మిథ్యాహంకారము లేనివాడై
సః = అతడు
శాన్తిం = సంపూర్ణశాంతిని
అధిగచ్ఛతి = పొందును

తాత్పర్యం :-

ఇంద్రియముల తృప్తి కొరకు అన్ని కోరికలనూ విడిచి నిరపేక్షుడై నివసించు వాడును ఇంద్రియ మమత్వమును అహంకారమును విడిచి ఉండువాడును మాత్రమే నిజమైన శాంతిని పొందజాలును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top