భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై ఎనిమిదవ శ్లోకము

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాబౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమ్ అవాప్స్యసి ||

సుఖదుఃఖే = సుఖదుఃఖములను
సమే = సమానములుగా
కృత్వా = చేసి
లాభాలాభౌ = లాభనష్టములను
జయాజయౌ = జయాపజయములను
తతః = తరువాత
యుద్ధాయ = యుద్ధము కొరకు
యుజ్యస్వ = నియుక్తుడవు కమ్ము
ఏవం = ఈ విధముగా చేసినచో
పాపం = పాపఫలమును
న అవాప్స్యసి = పొందవు

తాత్పర్యం :-

సుఖదుఃఖములను కాని, లాభనష్టములను కాని, జయాపజయములను కాని గనింపక యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయుము. అట్లు చేయుటచే నీకెప్పుడునూ పాపము కలుగదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top