భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము -యాబై ఐదవ శ్లోకము

శ్రీభగవానువాచ
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ||

శ్రీభగవానువాచ = శ్రీకృష్ణభగవానుడు పలికెను
ప్రజహాతి = విడుచునో
యదా = ఎప్పుడు
కామాన్ = ఇంద్రియభోగ కోరికలను
సర్వాన్ = అన్నివిధములైన
పార్థ = ఓ పృథాకుమారా
మనోగతాన్ = మానసిక కల్పితములైన
ఆత్మని = విశుద్ధమైన ఆత్మస్థితి యందే
ఏవ = నిశ్చయముగా
ఆత్మనా = విశుద్ధమైన మనస్సు చేత
తుష్టః = తృప్తినొందినవాడై
స్థితప్రజ్ఞః = దివ్యస్థితి యందు నెలకొనినవాడు
తదా = అప్పుడు
ఉచ్యతే = చెప్పబడును

తాత్పర్యం :-

భగవంతుడు అయిన కృష్ణుడు పలికెను - ఓ పార్థా! మనఃకల్పితములైన ఇంద్రియ తృప్తి కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు విడుచునో ఎప్పుడట్లు విశుద్ధమైన అతని మనస్సు ఆత్మయందే తృప్తిని పొందునో అప్పుడతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top