భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై ఐదవ శ్లోకము

అవ్యక్తోఽయమ్ అచింత్యోఽయమ్ అవికార్యోఽయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ||

అవ్యక్తః = కనబడనిది
అయం = ఈ ఆత్మ
అచిన్త్యః = ఊహింపరానిది
అయం = ఈ ఆత్మ
అవికార్యః = మార్పురహితము
అయం = ఈ ఆత్మ
ఉచ్యతే = అని చెప్పబడినది
తస్మాత్ = అందుచే
ఏవం = ఈ విధముగా
విదిత్వా = దానిని బాగుగా తెలిసికొని
ఏనం = ఈ ఆత్మ
అనుశోచితుం = దుఃఖించుటకు
న అర్హసి = తగవు

తాత్పర్యం :-

ఆత్మ అవ్యక్తము, ఊహింపరానిది, మార్పు లేనిదని చెప్పబడినది. ఈ విషయమును తెలిసికొనిన పిమ్మట దేహమును గూర్చి నీవు దుఃఖించుట అనుచితము.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top