భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై రెండవ, నలబై మూడవ శ్లోకము

యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః |
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||
కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||

యామిమాం = ఈ
పుష్పితాం = పుష్పితమగు
వాచం = వాక్కును
ప్రవదన్తి = చెప్పుదురు
అవిపశ్చితః = అల్పజ్ఞానముగల మానవులు
వేదవాదరతాః = వేదములను అనుసరించుచున్నామని చెప్పువారు
పార్థ = ఓ పృథాకుమారా
అన్యత్ = వేరొక్కటి
న అస్తి = లేదు
ఇతి = అని
వాదినః = వాదింతురు
కామాత్మానః = ఇంద్రియసుఖమును కోరి
స్వర్గపరాః = స్వర్గాదిలోకములను పొందగోరి
జన్మకర్మఫలప్రదామ్ = ఉత్తమజన్మను, ఇతర ఫలములను ఇచ్చునట్టి
క్రియావిశేష బహులాం = పలువిధములైన కర్మలతో కూడిన
భోగైశ్వర్య = ఇంద్రియసుఖమును, ఐశ్వర్యమును
గతిర ప్రతి = పొందుటను గూర్చి

తాత్పర్యం :-

అల్పజ్ఞులు స్వర్గాది లోకములను, ఉత్తమ జన్మమునూ, అధికారము మున్నగు వారిని పొందుటకు వివిధములైన సకామకర్మలను ఉపదేశించు వేదమునందలి మృదుమదురమైన వాక్యములచే ఆకర్షింపబడుదురు. ఇంద్రియ తృప్తినీ సంపన్నమైన జీవితమునూ కోరువారగుతచే వారు దీనికంటే వేరేదియు లేదు అని చెప్పుదురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top