భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై ఏడవ శ్లోకము

ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోఽను విధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ||

ఇన్ద్రియాణాం = ఇంద్రియముల యొక్క
హి నిశ్చయముగా
చరతాం = చరించుచున్న
యత్ = దేనితో
మనః = మనస్సు
అనువిధీయతే = స్థిరముగా మగ్నమైయుండునో
తత్ = అది
అస్య = అతని
హరతి = హరించును
ప్రజ్ఞాం = బుద్ధిని
వాయు = గాలి
నావం = నావను
ఇవ = వలె
అమ్భసి = నీటియందు

తాత్పర్యం :-

బలమైన గాలిచే నీటియందున్న పడవ త్రోసివేయబడునట్లు మనస్సు దానియందు లగ్నమైనచో చంచలమైన ఏ యొక్క ఇంద్రియమైననూ మానవును బుద్ధిని హరింపగలదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top