భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - మొదటి శ్లోకము

సంజయ ఉవాచ
తం తథా కృపయావిష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమ్ ఉవాచ మధుసూదనః ||

సంజయః ఉవాచ = సంజయుడు పలికెను
తం = అర్జునునితో
తథా = అట్లు
కృపయా = జాలితో
ఆవిష్టం = ఆవరింపబడినవానిని
అశ్రుపూర్ణాకుల ఈక్షణమ్ = కన్నీటితో కూడిన కన్నులు
విషీదన్తం = చింతించుచున్నవానిని
ఇదం = ఈ
వాక్యం = వాక్యమును
ఉవాచ = పలికెను
మధుసూదనః = మధువను రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుడు

తాత్పర్యం :-

సంజయడు పలికెను - జాలితో నిండిన వాడును, దుఃఖంతో గూడిన మనస్సు గలవాడును, కన్నీల్లతో గూడిన కన్నులు గలవాడును అగు అర్జునిని గూర్చి మధుసూదనడు ఈ క్రింది మాటలు పలికెను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top