భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై తొమ్మిదవ శ్లోకము

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః |
ఆశ్చర్యవచ్చైనం అన్యః శ్రుణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ||

ఆశ్చర్యవత్ = అద్భుతమైనదానిగా
పశ్యతి = చూచును
కశ్చిత్ = ఒకడు
ఏనం = ఈ ఆత్మను
ఆశ్చర్యవత్ = అద్భుతమైనదానిగా
వదతి = దానిని గూర్చి పలుకును
తథా = అట్లే
ఏవ = నిశ్చయముగా
చ = కూడా
అన్యః = ఇంకొకడు
ఆశ్చర్యవత్ = అట్లే అద్భుతమైనదిగా
చ = కూడా
ఏనం = ఈ ఆత్మను
అన్యః = మరియొకడు
శ్రుణోతి = వినును
శ్రుత్వాపి = వినికూడా
ఏనం = ఈ ఆత్మను
న వేద = ఎప్పుడును ఎరుంగడు
చ = మరియు
ఏవ = నిశ్చయముగా
కశ్చిత్ = ఇంకొకడు

తాత్పర్యం :-

కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా చూతురు. కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు. కొందరు దానిని గూర్చి అద్భుతమైన దానిగా విందురు. కొందరు వినిన తర్వాత కూడా దానిని గ్రహింపనే గ్రహింపజాలరు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top