భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై ఐదవ శ్లోకము

భయాద్రణాద్ ఉపరతం మంస్యంతే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||

భయాత్ = భయము చేతనే
రణాత్ = యుద్ధరంగము నుండి
ఉపరతం = తొలగిపోయినవానిగా
మంస్యన్తే = భావింతురు
త్వాం = నిన్ను
మహారథాః = గొప్ప సేనాపతులు
యేషాం = ఎవరికి
చ = కూడా
త్వం = నీవు
బహుమతః = గౌరవనీయుడవు
భూత్వా = అయి
యాస్యసి = పొందుదువు
లాఘవమ్ = చులకదనమును

తాత్పర్యం :-

నీ పేరును కీర్తిని అధికముగా గౌరవించిన గొప్ప సేనానాయకులు నీవు భయము వలననే యుద్ధరంగమును విడిచితివని భావింతురు. ఈ విధముగా వారు నిన్ను సామాన్యునిగా తలంతురు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top