భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవయవ శ్లోకము

యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః |
ఇంద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః ||

యతతోహ్యసి = ప్రయత్నించుచున్నవాడైనను
కౌన్తేయ = కుంతీపుత్రా
పురుషస్య = మానవునికి
విపశ్చితః = యుక్తాయుక్త జ్ఞాన పూర్ణుడైన
ఇన్ద్రియాణి = ఇంద్రియములు
ప్రమాథీని = కలతను కలిగించునట్టి
హరన్తి = హరించును
ప్రసభం = బలవంతముగా
మనః = మనస్సును

తాత్పర్యం :-

ఓ అర్జునా! ఇంద్రియములు బలవంతములును, దృడములును అగుటచే వానిని నిగ్రహించుటకు గాడముగా ప్రయత్నించు యుక్తాయుక్త జ్ఞాననము గల పండితుని యొక్క మనస్సు కూడా బలవంతముగా ఆకర్షించును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top