భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై మూడవ శ్లోకము

నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ||

ఏనం = ఈ ఆత్మను
న ఛిన్దన్తి = ఛేదింపజాలవు
శస్త్రాణి = ఆయుధములు
ఏనం = ఈ ఆత్మను
న దహతి = దహింపదు
పావకః = అగ్ని
ఏనం = ఈ ఆత్మను
న చ క్లేదయన్తి = తడుపజాలదు
ఆపః = నీరు
న శోషయతి = ఆర్పివేయజాలదు
మారుతః = వాయువు

తాత్పర్యం :-

ఈ ఆత్మను ఆయుధములు ముక్కలుగా ఖండింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయనూజాలదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top