భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై ఆరవ శ్లోకము

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి ||

అథః = ఒకవేళ
చ = కూడా
ఏనం = ఈ ఆత్మను
నిత్యజాతం = సర్వదా పుట్టునదిగను
నిత్యం = ఎల్లప్పుడును
మృతం వా = మరణించుదానిగను
మన్యసే = తలంచినను
తథాపి = అయినను
త్వం = నీవు
మహాబాహో = గొప్ప పరాక్రమముతో కూడిన బాహువులు కలవాడా
ఏనం = ఈ ఆత్మను గూర్చి
శోచితుం = దుఃఖించుటకు
న అర్హసి = తగవు

తాత్పర్యం :-

గొప్ప పరాక్రమము గల బాహువులు గల వాడ ఒకవేల నీ ఆత్మ పదేపదే పుట్టునదియు మరణించునదియు అని తలంచుచొ అప్పుడు కూడా నీవు దుఃఖించుట తగదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top