భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పై మూడవ శ్లోకము

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి |
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ||

అథ = అందుచే
చేత్ = ఒకవేళ
త్వం = నీవు
ఇమం = ఈ
ధర్మ్యం = ధర్మానుగుణమైన
సంగ్రామం = యుద్దమును
న కరిష్యసి = చేయనిచో
తతః = అప్పుడు
స్వధర్మం = నీ స్వధర్మమును
కీర్తిం = కీర్తిని
చ = కూడా
హిత్వా = కోల్పోయి
పాపం = పాపమును
అవాప్స్యసి = పొందుదువు

తాత్పర్యం :-

ఒక వేల నీవు యుద్ధము చేయుటయను స్వధర్మము నిర్వహింపనిచో స్వధర్మమును ఉపేక్ష చేసిన పాపమును పొందుటయే కాక యోదుడుగా నీ కీర్తిని కూడా కోల్పోదువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top