భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - పదనాలుగవ శ్లోకము

మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః |
ఆగమాపాయినోఽనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ||

మాత్రాస్పర్శాః = ఇంద్రియానుభవములు
తు = కేవలము
కౌన్తేయ = ఓ కుంతీపుత్రా
శీత = చలికాలము
ఉష్ణ = ఎండాకాలము
సుఖ = సుఖమును
దుఃఖ = దుఃఖమును
దాః = ఇచ్చునట్టివి
ఆగమాపాయినః = రాకపోకలు కలవి
అనిత్యాః = తాత్కాలికములు
తాన్ = వాటిని
తితిక్షస్వ = సహింపుము
భారత = భరతవంశీయుడా

తాత్పర్యం :-

కుంతీపుత్ర సుఖ దుఃఖముల తాత్కాలికమైన రాకయు, కాలక్రమమున పోకయు సీత గ్రీష్మ అనుబముల వంటివి. భరతవంశీయుడా అవి ఇంద్రియానుభవము వలన కలుగుచుండును. ఎల్లవారునూ కలత పొందక వారిని సహింపవలయును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top