భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - యాబై రెండవ శ్లోకము

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

యదా = ఎప్పుడు
తే = నీ యొక్క
మోహకలిలం = మోహారణ్యమును
బుద్ధిః = దివ్య సేవతో కూడిన బుద్ధి
వ్యతితరిష్యతి = అతిక్రమించునో
తదా = అప్పుడు
గన్తాసి = పొందినవాడవు అగుదురు
నిర్వేదం = విరక్తిని
శ్రోతవ్యస్య = వినవలసిన దాని యెడ
శ్రుతస్య = వినినదాని యెడ
చ = కూడా

తాత్పర్యం :-

ఎప్పుడు నీ బుద్ధి మొహమను దట్టమైన అడవిని దాటునో అప్పుడు నీవు వినబడిన దాని యడను, వినవలసిన దాని యడను విరక్తి కలవాడగుదువు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top