భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ముప్పయవ శ్లోకము

దేహీ నిత్యం అవధ్యోఽయం దేహే సర్వస్య భారత |
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ||

దేహీ = భౌతికదేహమునకు యజమానుడు
నిత్యం = ఎల్లప్పుడును
అవధ్యః = చంపబడడు
అయం = ఈ ఆత్మ
దేహే = శరీరమునందు
సర్వస్య = అందరి యొక్క
భారత = ఓ భరతవంశీయుడా
తస్మాత్ = అందుచే
సర్వాణి భూతాని = పుట్టిన జీవులన్నింటిని గూర్చియు
త్వం = నీవు
శోచితుం = దుఃఖించుటకు
న అర్హసి = తగవు

తాత్పర్యం :-

భరతవంశీయుడైన ఓ అర్జునా! దేహము నందు వసించు ఆత్మఎప్పుడునూ చంపబడదు. అందుచే నీవు ఏ జీవుని కొరకును దుఃఖింపవలసిన అవసరము లేదు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top