భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నాలుగవ శ్లోకము

అర్జున ఉవాచ
కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ||

అర్జునః ఉవాచ = అర్జునుడు పలికెను
కథం = ఎట్లు
భీష్మం = భీష్ముని
అహం = నేను
సంఖ్యే = యుద్ధమునందు
ద్రోణం చ = ద్రోణుని కూడా
మధుసూదన = ఓ మధుసంహారీ
ఇషుభిః = బాణములతో
ప్రతియోత్స్యామి = ఎదుర్కొనగలను
పూజఅర్హౌ = పూజింపదగిన వారు
అరిసూదన = ఓ శత్రుసంహారా

తాత్పర్యం :-

అర్జునుడు పలికెను - ఓ శత్రుసంహారక, ఓ మధుసూదన నాకు పూజ్యనీయులైన భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలను ఎదిరించి భాణములతో నేను ఎట్లు యుద్ధం చేయగలను.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top