భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - నలబై తొమ్మిదవ శ్లోకము

దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ధనంజయ |
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ||

దూరేణ = దూరముగా వదలుము
హి = నిశ్చయముగా
అవరం = హీనమైన
కర్మ = కర్మను
బుద్ధియోగాత్ = కృష్ణభక్తిభావనా బలముచే
ధనంజయ = అర్జునా
బుద్ధౌ = అట్టి భావనలో
శరణం = శరణమును
అన్విచ్ఛ = ప్రయత్నింపుము
కృపణాః = లోభులు
ఫలహేతవః = ఫలమును గోరువారు

తాత్పర్యం :-

ఓ ధనంజయా! భక్తియుక్తమైన సేవచే హీనములైన కర్మములన్నింటినీ దూరముగా వదులుము. తృష్ణచైతన్యముతో భగవంతుని శరను పొందుము. కర్మఫలములను అనుభవింపగోరువారు లోబులు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top