భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - అరవై ఐదవ శ్లోకము

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ||

ప్రసాదే = భగవానుని నిర్హేతుక అనుగ్రహము కలుగగా
సర్వదుఃఖానాం = సమస్త భౌతికదుఃఖములు
హాని = నాశము
అస్య = అతనికి
ఉపజాయతే = కలుగును
ప్రసన్నచేతసః = సుఖముతో కూడిన మనస్సుగలవానికి
హి = నిశ్చయముగా
ఆశు = శీఘ్రముగా
బుద్ధిః = బుద్ధి
పర్యవతిష్టతే = సుస్థిరమగును

తాత్పర్యం :-

ఈ విధముగా తృష్ణచైతన్యముతో తృప్తి పొందిన వాడికి భౌతిక జీవతమునకు సంబందించిన త్రివిదములైన క్లేషములు కలుగవు. సంతృప్తితో కూడిన అట్టి చైతన్యంలో మానవుని బుద్ధి సీగ్రముగా తప్పక సుప్రతిష్టితమగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top