భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై ఒకటవ శ్లోకము

వేదావినాశినం నిత్యం య ఏనం అజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కం ||

వేద = తెలిసినవాడు
అవినాశినం = నాశనము లేనిది
నిత్యం = శాశ్వతమైన
యః = ఎవడు
ఏనం = ఈ ఆత్మను
అజం = పుట్టుక లేనిది
అవ్యయమ్ = క్షయము లేనిది
కథం = ఎట్లు
సః పురుషః = అతడు
పార్థ = ఓ అర్జునా
కం = ఎవనిని
ఘాతయతి = చంపించును
హన్తి = చంపును
కం = ఎవనిని

తాత్పర్యం :-

ఓ పార్థా! ఆత్మ నాశనము లేనిదియు, శాశ్వతమును, అజమును, అక్షయమునూ అని తెలిసికొన్న వ్యక్తి ఎవ్వరిని కానీ ఎట్లు చంపగలడు, ఎట్లు చంపింపగలడు.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top