భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఇరవై నాలుగవ శ్లోకము

అచ్చేద్యోఽయం అదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణుః అచలోఽయం సనాతనః ||

అచ్ఛేద్యః = ఛేదింపబడనిది
అయం = ఈ ఆత్మ
అదాహ్యః = దహింపబడనిది
అయం = ఈ ఆత్మ
అక్లేద్యః = తడుపబడనిది
అశోష్య = ఎండింపబడనిది
ఏవ = నిశ్చయముగా
చ = మరియు
నిత్యః = శాశ్వతమైనది
సర్వగతః = సర్వవ్యాపకమైనది
స్థాణుః = మార్చుటకు వీలులేనిది
అచలః = చలనము లేనిది
అయం = ఈ ఆత్మ
సనాతనః = శాశ్వతముగా ఒకే విధముగా నుండునది

తాత్పర్యం :-

జీవాత్మ చేదించుటకు వీలు లేనిది. నీటిలో కరిగించుటకు వీలు లేనిది. దానిని దహించుట గాని, ఎడించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వ వ్యాపకము, మార్పు లేనిది, కదిలించరానిదై శాశ్వతముగా ఒకే విధమున ఉండును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top