భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము

భగవద్గీత - సాంఖ్యయోగము - రెండవ అధ్యాయము - ఐదవ శ్లోకము

గురూనహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే |
హత్వార్థకామాంస్తు గురునిహైవ భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ||

గురూన్ = పెద్దలు
అహత్వా = చంపకుండ
హి = నిశ్చయముగా
మహానుభావాన్ = మహాత్ములను
శ్రేయః = ఉత్తమము
భోక్తుం = అనుభవించుట
భైక్ష్యం అపి = భిక్షమైనను
ఇహలోకే = ఈ లోకమునందు
హత్వా = చంపి
అర్థకామాన్ = లాభమును కోరువారిని
తు = కాని
గురూన్ = పెద్దలను
ఇహ = ఈ లోకమున
ఏవ = నిశ్చయముగా
భుఞ్జీయ = అనుభవింపవలయును
భోగాన్ = భోగములను
రుధిరప్రదిగ్థాన్ = రక్తముచే మలినమైన

తాత్పర్యం :-

నాకు గురువులైన మహానుబావుల జీవితములను హరించిజీవించుట కంటే ఈ లోకమున బిచ్చమెత్తుకొని జీవించుటయైననూ మేలే. వారు ప్రాపంచిక లాభమును కోరుచున్నవారైననూ నాకంటే పెద్దలే. వారిని సంహరించినచో మేమనుభవించునదంతయు రక్తపంకిలమగును.

Facebook
Twitter
Telegram
WhatsApp
Pinterest
Scroll to Top